సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, బుధవారం ఉదయం 1 కోటి 1 లక్ష 50 వేల రూపాయల ప్రభుత్వ నిదులతో 31 వార్డులోని కొత్త రామాలయం నుండి ఆదిత్య జూనియర్ కాలేజీ వరకు సిసి రోడ్ మరియు సిసి డ్రైన్ ఆర్సీసీ స్లాబ్ కల్వర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. శరవేగంగా మంచి క్వాలిటీ తో పనులు జరుగుతాయని .ఈ కొత్త రోడ్డు తో స్థానిక బలుసుమూడి ప్రాంత ప్రజలకు ,మునుసుబ్ వీధి,కొత్త రామాలయం సీసీ రోడ్డు అందుబాటులోకి వస్తాయని భీమవరం పట్టణంలో ప్రతి వార్డు లో ప్రజల కోసం సంక్షేమ పధకాలతో పాటు ఎన్నో అబివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక పెద్దలు తో పాటు మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ , ఎంపీపీ నరసింహరాజు ,పార్టీ నేతలు తోట బోగయ్య, గాదిరాజు సుబ్బా రాజు(తాత రాజు) ఏ ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *