సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, బుధవారం భీమవరం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రిస్తున్న పోలీస్ ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఎయిర్ కూలింగ్ హెల్మెట్స్ ట్రయల్ ను ప్రారంభించి భీమవరం ట్రాఫిక్ పోలీస్ అధికారి తలపై స్వయంగా అమర్చి దాని పనితీరును అడిగి తెలుస్తుకొన్నారు. తలపై చల్లగా ఉందని పనితీరుపట్ల వారు సంతృప్తి ని వ్యక్తం చెయ్యడం జరిగింది. ఈ సంద్భర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎండనక వాననక, దుమ్ము దూళి లో, వాహన కాలుష్యంతో సెంటర్లో నిలబడి ట్రాఫిక్ పోలీస్ ల విధి నిర్వహణ చాల కష్టమని , ప్రస్తుతం కాస్తున్న ఏండ్లల్లో మనం 5 నిముషాలు నిలబడలేమని అటువంటిది ట్రాఫిక్ నిర్వహించే పోలీసులు ఆలా నిలబడే ఉంటారని వారికోసమే నూతనంగా తయారు చేసిన కొన్ని ఏసీ హెల్మట్స్ వాడకం ట్రయల్ ప్రారంభించామని వాటి సమర్ధత బాగుంటే వాటిని అందరికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
