సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి నందు వేంచేసి యున్న పవిత్ర పంచారామ క్షేత్రం, శ్రీ సోమేశ్వర జనార్థనస్వామి వార్ల దేవస్థానం నందు గత 98 రోజులుగా భక్తులు సమర్పించిన హుండీ కానుకల ఆదాయం నేడు, బుధవారం లెక్కించగా 5,22,451 రూపాయలు, బంగారం 2గ్రాములు 80 మిల్లి గ్రాములు, 420 గ్రాముల వెండి తో పాటు కొంత విదేశీ కరెన్సీ వచ్చిందని కార్యనిర్వాహక అధికారి సి.హెచ్.సురేష్ నాయుడు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కోడే విజయలక్ష్మి మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, స్థానిక గునుపూడి ప్రాంతవాసులు పాల్గొన్నారని తెలిపారు. ది.08-06-2023 అనగా రేపు ఉదయం గం.7.42ని.లకు శ్రీ గుండా శ్రీరామమూర్తి, పరిపూర్ణమ్మ దంపతుల జ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులచే ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవము మరియు ఆలయం అభివృద్ది పనులకు శంఖుస్థాపన కార్యక్రమం ధర్మకర్తల మండలి అధ్యక్షులు. కోడే విజయలక్ష్మి మరియు ధర్మకర్తల మండలి సభ్యులచే నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.
