సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళనాడు లోని అరుణాచలం చేరుకోవడానికి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 ఆర్టీసీ బస్సు స్టాండ్ ల నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే.. అయితే ట్రైన్ లలో చెన్నయ్ చేరుకొనే లక్షలాది శివభక్తులకు శుభవార్త! ఏమిటంటే గిరిప్రదక్షిణ రోజుల్లో తిరువణ్ణామలై( అరుణాచలం ) క్షేత్రానికి చెన్నై, మైలాడుదురైల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే శాఖ ప్రకటించింది. ఈ భక్తుల సౌకర్యార్థం చెన్నై, మదురై, కోయంబత్తూర్ తో సహా తమిళనాడులోని ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని కోరుతూ దక్షిణ రైల్వేకు పలువురు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన దక్షిణ రైల్వే పౌర్ణమి రోజుల్లో మాత్రం చెన్నై బీచ్, తాంబరం, మైలాగుదురై ప్రాంతాల నుంచి జూలై నుంచి డిసెంబరు వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది.
