సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి భీమవరం మీదుగా బెంగళూరుకు ప్రయాణికుల డిమాండ్ మేరకు వారాంతపు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. నెం.07153 నరసాపురం-ఎస్‌ఎంబీటీ బెంగళూరు వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 9, 16, 23, 30 (శుక్రవారాలు) తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు నరసాపురంలో బయల్దేరి శనివారం ఉదయం 9.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. అలాగే, నెం.07154 ఎస్‌ఎంబీటీ బెంగుళూరు- నరసాపురం వారంతపు ప్రత్యేక రైలు ఈ నెల 10, 17, 24, జూలై 1 (శనివారం) తేదీల్లో ఉదయం 10.50 గంటలకు బెంగళూరులో బయల్దేరి ఆదివారం ఉదయం 6 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. ఈ రైళ్లు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్‌, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, బంగారుపేట, కృష్ణరాజపురం స్టేషన్ లలో ఆగుతూ ప్రయాణం చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *