సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ లో టీడీపీ ఎంపీ కేశినేని నాని చాల కాలంగా అధినేత చంద్రబాబు ఫై తన ప్రవర్తన తో తిరుగుబాటు ప్రకటిస్తున్నప్పటికీ కష్టకాలంలో ఉన్న పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలలో ఒకరిని కోల్పోవడం ఎందుకని పార్టీ అధిష్టానం ఓపికగా ఎదురుచూస్తున్నా విషయం అందరికి తెల్సిందే. తనకు వ్యతిరేకంగా సొంత తమ్ముడైన కేశినేని చిన్ని ని టీడీపీ అధిష్టానం ప్రోత్సహించడాన్ని తప్పుపడుతూ నాని గత కొంత కాలం గా సొంత పార్టీపై విమర్శ లు కురిపిస్తున్నా రు. గత కొంత కాలంగా జిల్లాలోని టీడీపీ కీలక నేతలు బుద్ధా వెంకన్న, దేవినేని ఉమా లపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా విజయవాడ ఎంపీ కేశినేని నాని నిన్న బాగా ఘాటు పెంచి నిన్న కూడా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. తన పార్లమెం ట్ నియోజకవర్గ పరిధిలోని ఇన్‌చార్జ్‌లను గొట్టం గాళ్లని వారి ఫోటోలను చూపిస్తూ మరి పరుష పదజాలం తో దూషిం చారు. దీనిపై నేడు, శుక్రవారం స్పందించారు మాజీ ఎమ్మె ల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ… కేశినేని నాని ఎన్నో సార్లు తనను అవమానించిన సైలెంట్ గా ఉన్నా నని.. అది కేవలం చం ద్రబాబు నాయుడుకి ఇచ్చి న మాట కోసం మాత్రమేనని .. అయితే ఈసారి వచ్చే ఎన్నికలలో ఆ.. గొట్టంగాడు గెలవడు ( కేశినేని నాని ని ఉద్దేశిస్తూ..) అనేసారు. అయితే విజయవాడ ఎం పీ టికెట్‌ను టీడీపీ ఏ పిట్టలదొరకెవరికో కేటాయిస్తారని, తాను స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి గెలుస్తానని కేసినేని నాని గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.మొత్తానికి టీడీపీ ని ఎన్నికలకు సన్నద్ధం చేద్దామని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు ఇలా స్వంత పార్టీలోనే ముసలం పుట్టడం పట్ల కృష్ణ జిల్లా నేతలు ఇది ఏ పరిణామాలకు దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
