సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎండ తీవ్రతకు రాష్ట్రంలో పలు ప్రాంతాల తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. రాత్రిళ్ళు కూడా చల్లబడక ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నశుక్రవారం నేడు, శనివారం కూడా అనేకచోట్ల 40 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటింది. కాగా రాయలసీమ, కోస్తాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ వరకు ఎండలు, వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గత గురువారం కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు శనివారంకల్లా తమిళనాడు, కర్ణాటకల్లో కొన్ని ప్రాంతాలకు, విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఉన్న అతి తీవ్ర తుఫాన్ ‘బిపర్జాయ్’ ఉత్తర ఈశాన్యంగా పయనించి సాయంత్రానికి గోవాకు 740 కిలోమీటర్లు పశ్చిమంగా కేంద్రీకృతమై ఉంది. ఉత్తర ఈశాన్యంగా తరువాత వాయవ్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
