సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2023) ఫలితాలు ఈ జూన్ 14న(బుధవారం) ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేస్తారని AP EAPCET ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ఆచార్య జి.రంగ జానార్ధన, కన్వీనర్ ఆచార్య సి. శోభా బిందు ఓ ప్రకటనలోతెలిపారు.ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన ఇంటర్ మార్కులకు 25శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు.
