సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎండాకాలం ఎప్పుడు ముగుస్తుందో.. నైరుతి రుతుపవనాలు ఇంకా వర్షాలు తీసుకోని రావేమిటి? ఈ నిప్పుల కుంపటి నుండి తప్పించుకోవాలని చేస్తున్న ప్రజలకు శుభవార్త! ఇకపై రాష్ట్రం లో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. . దీంతో నేటి సోమవారం నుంచి రాయలసీమ లో అనేక చోట్ల అనేక చోట్ల వర్షాలు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి జిల్లాలలో కూడా చెదురు మదురుగా వర్షాలు పడుతున్నాయి. వాతావరణం చల్లబడింది. కోస్తాం ధ్రలో కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఉందని గంటకు 30–40 కి.మీల వేగం తో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కాగా రాగల 3 రోజులలో కోస్తా ఆంధ్ర లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు జోరు అందుకొంటాయని ప్రకటించారు.
