సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని మెంటే వారి తోటలో గత ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జయవర్ధన ఫర్నిచర్ షాప్ అగ్నికి ఆహుతి అయింది. లక్షలాది రూపాయలు ఆస్థి నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబం ఉంగరాల రాజు కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. విద్యుత్తూ షార్ట్ సర్కూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిఉంటుందని భావిస్తున్నామని, ఐతే ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు మనో ధైర్యంతో మనం ముందుకు వెళ్లాలని, ఖచ్చితంగా ఇంతకు రెట్టింపు ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మీ కుటుంబానికి మేలు చేస్తాడని, ప్రభుత్వ పరంగా కూడా అదుకొంటామని ధైర్యం చెప్పారు. కాగా ఉంగరాల రాజు కుటుంబాన్నితక్షణం ఆదుకునేందుకు గ్రంధి శ్రీనివాస్ వ్యక్తిగతంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు
