సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 26వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశిస్తుంది. జన సైనికులు భారీ స్వాగతానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఈనెల 26 వ తేదీన సాయంత్రం 5 గంటలకు నరసాపురంలో బహిరంగ సభ లో పాల్గొంటారని పార్టీ షెడ్యూలు లో ప్రకటించారు. ఇక తదుపరి నరసాపురం బహిరంగ సభ అనంతరం రాత్రి భీమవరం వస్తారా? లేక అక్కడ కొంత విరామం తీసుకొంటారా ? తెలవలసి ఉంది. ఏది ఏమైనా తదుపరి బహిరంగ సభ భీమవరంలో ఉంటుంది కాబ్బటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన క్యాడర్ తో సమావేశాలు ఉంటాయి కాబట్టి 3 లేక 4 రోజులు భీమవరంలోనే పవన్ కళ్యాణ్ ఉండటానికి జనసేన పార్టీ పెద్దలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
