సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అడ్జక్షుడు సోము వీర్రాజు మీడియా తో మాట్లాడుతూ.. చంద్రబాబు తో బీజేపీ పొత్తు వార్తలను ఖండించారు. నోటా ఓట్లు కూడా లేని పార్టీ బీజేపీ అని అవమానించిన చంద్రబాబు తో పొత్తు ఎలా పెట్టుకొంటామని ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయని అనే అర్హత చంద్రబాబు కు లేదని, అయన హయాంలో ఎవరికీ రక్షణ ఇచ్చారని, సాక్షాతూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పైనే రాళ్ల దాడి జరిగిందని ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదని, కేంద్ర దర్యాప్తు సంస్థ ‘సీబీఐ‘ని రాష్ట్రంలోకి రాకుండా చంద్రబాబు నిషేధం విధించారని గుర్తు చేసారు. చంద్రబాబు తాను సీఎంగా ఉన్న సమయంలో అనుమతించకుంటే జగన్ పాదయాత్రలు చేసేవారా? అని అంటున్నారని..ఎన్నో అడ్డంకులు పెట్టడం వల్లే కదా? ఐదేళ్లు ప్రతిపక్ష నేత,జగన్ను రోడ్లపై నడిపించారని అన్నారు. బెంగాల్లో ఐదు వందల మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురైనా తాము ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలని రెండు చేతులు జోడించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దన్నారని తెలిపారు. ఇప్పుడు సభలు పెడుతున్న చంద్రబాబును అప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారో ప్రశ్నిస్తున్నారా? అని మీడియాను ఎదురు ప్రశ్నించారు.
