సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం 3 టౌన్ లోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ వారి గౌడన్ లోని బ్లీచింగ్, సానిటరీ కి సంబందించిన , చేపల చెరువుల శుద్ధికి వాడే రసాయనాలకు, పౌడర్లు కు నిప్పు అంటుకోవడంతో గత మంగళవారం రాత్రి 8 గంటలకు తీవ్ర అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఏకంగా 4 ఫైర్ ఇంజెన్స్ ఉపయోగించి మంటలను అదుపులోకి తేవడానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. నేటి బుధవారం ఉదయం కూడా అక్కడ అక్కడ మంటలు రేగుతూనే ఉండి ఆ ప్రాంతం పొగలు చిమ్ముతుంది. తీవ్రమైన వేడి పోగల వాసనలు స్థానికులు వందలాది మంది మంటల భయంతో పాటు తీవ్ర రసాయన వాసనతో శ్వాస తీసుకోవడం కష్టమైయిందని తాము అనారోగ్యం పాలయ్యామని ఆందోళన వ్యక్తం చేసారు. గౌడన్ నిర్వాహకులు కోటి రూపాయలు సరకు పైగా అగ్నికి ఆహుతి అయ్యిందని భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణం తెలియవలసి ఉంది. ( ఫై తాజా చిత్రాలలో పూర్తిగా దగ్ధం అయిన గోడౌన్ ను పరిశీలించవచ్చును)
