సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్‌పవార్ భీమవరంలో, పాలకొల్లు లో పర్యటించారు. భీమవరం అంబేద్కర్ సెంటర్ నుండి విజయలక్ష్మి థియేటర్స్ వరకు ఇటీవల 22 కోట్లతో కేవలం 7 నెలల్లో నిర్మించిన రైల్వే అండర్ బ్రీజ్ ను ఆమె పరిశీలించారు.దీని వల్ల భీమవరంలో భారీ ట్రాఫిక్ రద్దీని నివారించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోడీ హయాంలో ‘సబ్ కా సాత్–సబ్ కా వికాస్’ సూత్రంతో దేశం ముందడుగు వేస్తోందన్నారు. ఆమెతో రైల్వే అధికారులతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ, పాకా సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. భీమవరం హాస్పిటల్లో మేధావులతో, వైద్యులతో సమావేశం అయ్యారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా 648 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని, లక్ష వరకు ఎంబీబీఎస్ సీట్లను పెంచడం జరిగిందని, కరోనా సమయంలో దేశవ్యాప్తంగా 220 కోట్ల వ్యాక్సిన్ ఉచితంగా ప్రజలకు వేశామన్నారు. భీమవరం నుండి ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 710 మార్కులతో 61వ ర్యాంక్ సాధించిన వెగ్నేశ్న రోహిత్ వర్మ ను ఆమె అభినందించారు. కేంద్ర మంత్రి డాక్టర్ భారతి పాలకొలు శివారు పెంకుళ్ళపాడులో నిర్మించిన టిడ్కో గృహాలను నేడు గురువారం సందర్శించి కేంద్ర నిధులతో వీటిని నిర్మించారని కానీ అక్కడ ప్రధాని మోడీ బొమ్మ కానీ, ఆయన పేరు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, మీడియా ముందు తన అసంతృప్తి వ్యక్తం చేసారు.
