సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : భీమవరం లోని డి.యన్.ఆర్. కళాశాల గ్రౌండ్ లో జాతీయ సేవ పధకంమరియు స్పోర్ట్స్ & గేమ్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2023 ను కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ Dr .యం. అంజాన్ కుమార్ మాట్లాడుతూ.. యోగాతో శారీరక, మానసిక వ్యాధులను నయం చేసుకోవచునని , పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్యకానుక యోగాననిఅన్నారు . అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ భారత ప్రభుత్వం 2014లో ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించిదని, 175 దేశాలు దీన్ని ఆమోదించాయి. అదే సంవత్సరం డిసెంబరు 11న ప్రధాని మోదీ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని ప్రకటించింది అన్ని తెలిపారు ,ఈ కార్యక్రమములో కళాశాల ఫిసికల్ డైరెక్టర్ .పి.నరసింహరాజు యాన్ యాన్ యస్ ప్రోగ్రాం ఆఫీసర్ v ప్రవీణ్ మరియు కే శిరీష విద్యార్ధులు, ఉపాధ్యాయులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు
