సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డ్రగ్స్ వ్యాపారంలో ‘కబాలి’ తెలుగు సినిమా నిర్మా త సుంకర కృష్ణప్రసాద్ అలియాస్ కేపీ చౌదరి . ఈ నెల 14న అరెస్టు అయ్యాక తెలుగు సినీ,రాజకీయ ప్రముఖులలో ఆందోళన రేకెత్తించింది. కేపీచౌదరి సాగించిన కొకైన్ దందా.. కొనుగోలు చేస్తున్నవారి జాబితాను పోలీసుల రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. కొకైన్ కొనుగోలు చేసిన వారి జాబితా గూగుల్డ్రైవ్లో ఉన్నట్టు కనుగొన్నారు. వారి వివరాలు ఫొటోలతో సహా బయటపడ్డాయి. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 12 మంది సినీ, టీవీ నటీనటులు, మోడల్స్, వ్యాపారులు ఉన్నారు. వారు.. ఫోన్ కాల్స్ తో రూ.లక్షల్లో లావాదేవీలు జరుపుతున్న కేపీచౌదరి కి చెందిన నాలుగు సెల్ ఫోన్ లలో వందల మంది ప్రముఖుల ఫోన్ నంబర్లున్నాయి. వీరిలో ఎక్కువ సార్లు కాల్ చేసి సంబాషించిన వారిలో ఏపీలోని భీమవరం ప్రాంత వాసి సురేష్ రాజు ఉన్నట్లు పోలీసులు గుర్తించి ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు అని వార్త సమాచారం. తరువాత హనుమకొండకు చెందిన అనురూప్తో, బిగ్ బాస్ లో పాపులర్ అయిన సినీ నటి ఆషురెడ్డి తోనూ సినీ తార జ్యో తి, అమెరికాలో ఉన్న డి.అమర్లతోనూ చౌదరి ఎక్కు వసార్లు మాట్లాడాడు. వీరితో ఆర్ధిక లావాదేవీలు ఏ మేర జరిగాయి. వీరితో డ్రగ్స్ లింక్స్ ఏ మేర ? ఉన్నాయి అన్న కోణంలో పోలీస్ దర్యాప్తు వేగవంతం అయ్యింది.
