సిగ్మాతెలుగు డాట్, న్యూస్: డి.యన్.ఆర్ కళాశాలలో జరిగిన క్యాంపస్ ఉద్యోగ ఎంపికలలో విద్యార్ధులు 20 మందికి జస్ట్ డయల్ , క్యాప్ జెమిని అనే సంస్ధలలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి అని కళాశాల వైస్ ప్రెసిడెంట్, గోకరాజు పాండురంగరాజు తెలియజేసారు. కళాశాలలో ప్రతీ సంత్సరం క్రమ పద్దతిలో అనేక పర్యాయాలు ప్రాంగణ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తు డి.యన్.ఆర్ కళాశాలో చదివిన విద్యార్దులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) మాట్లాడుతూ.. డి.యన్.ఆర్ కళాశాలలో విద్యార్ధులకు కేవలం నాణ్యమైన విద్యను అందించుటే కాకుండు తగు రీతిన ప్రత్యేక తర్పీదు, శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని అన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యస్.శాంత కుమారి, పాలకవర్గ సభ్యులు పి.రామకృష్ణంరాజు మాట్లాడుతూ .. ప్రస్తుతం ఉద్యోగాలకు ఎంపిక కాబడిన విద్యార్ధులకు ఆయా సంస్ధలలో ఫైన్సాన్సియల్ అకౌంటింగ్, కష్టమర్ రిలేషన్, మార్కెటింగ్ మొదలగు విభాగాలలో సంవత్సరానికి రూ.2.80 లక్షలు పైబడి ప్యాకేజ్ తో నియమించబడ్డారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అద్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
