సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో డి.యన్.ఆర్ కళాశాల వ్యవస్దాపక దినోత్సవ కార్యక్రమం లో భాగంగా కళాశాల ప్రాంగణంలో .. కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు(బాబు) సత్యనారాయణరాజు(బాబు) తదితర ప్రముఖులు.. స్వర్గీయ దంతులూరి నారాయణరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను ప్రస్తుతించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 1945 జులై 4 తేదీన కళాశాల ప్రారంబించబడి శాఖోకశాఖలుగా ఎదిగి ప్రస్తుతం కె.జి.నుండి పి.జి వరకూ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, లా, బి.యి.డి మొదలగు 13 విద్యాసంస్ధలతో ఈ ప్రాంతంలో అతిపెద్ద విద్యాసంస్ధగా విరాజిల్లుతుందని.. స్వర్గీయ దంతులూరి నారాయణరాజు ఆశయాలకు అనుగునంగా లాబాపేక్ష లేకుండా పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందింస్తున్నామని అన్నారు. అదేవిధంగా నూతన టెక్నాలజీలకు అనుగుణంగా కొత్త కోర్సుల ప్రవేశపెట్టి విద్యార్ధులకు విద్యాతో పాటు ఉద్యోగ అకాశాలు కల్తిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.యస్ శాంత కుమారి తదితర అధ్యాపక సిబ్బంది, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
