సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రకాశం జిల్లా దర్శిలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి సాగర్ కాలువలోకి పెళ్లి బస్సు దూసుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో బస్సులో ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు మరో పద్దెనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు. పొదిలి లో ఘనంగా పెళ్లి జరిగాక అక్కడ నుంచి బంధు మిత్రులు ఆనందముతో కాకినాడలో వివాహ రిసెప్షన్ కి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిపి 47 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.గత రాత్రి 12:50 కు ఎదురుగా మరో బస్సు రావటంతో సైడ్ ఉన్న కాంక్రీట్ దిమ్మెను ఢీ కొట్టడంతో అదుపుతప్పి సాగర్ కాలువలోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది.. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ హాస్పిటల్‌కి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ దుర్ఘటన పట్ల సీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసి బాధితుల వైద్య చికిత్సలపై ఆరాతీసి వారిని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొంటుందన్నారు.
