సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు ఉత్తర భారత దేశం లోని నదులకు వరదలు పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నా యి. ఇప్ప టి వరకు 100మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం. యుమునా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయి అయిన 205.33 మీటర్లను దాటి 207.18 మీటర్లకు చేరింది. గత పదేళ్లలో ఇదే అత్యధికం. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ లోనే 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఆ రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టంవాటిల్లింది. పలుచోట్ల వరద ఉధృతికి భవనాలు రోడ్లు కొట్టుకుపోవడం , కొం డచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటుచేసుకొన్నాయి. హిమాచల్ పర్వత ప్రాంతాల్లో వందలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. పంజాబ్లో 15 మంది, ఉత్తరాఖండ్లో గత 24 గంటల్లో కొండచరియలు విరిగిపడి 9 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. వేలకోట్ల అష్టి నష్టం జరుగుతుంది. రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్, హర్యానాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతోంది.
