సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డి.యన్.ఆర్ కళాశాల, లైబ్రరీ అవరణలో కళాశాల పాలక వర్గ అధ్యక్ష మరియు కార్యదర్సులు, గోకరాజు వెంకట నరసింహరాజు మరియు గాదిరాజు బాబు, ఆధ్వర్యంలో నేడు, శుక్రవారం ఉదయం 9:00 గంటల నుండి ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చెయ్యగా పలువురు మహిళలు, వృద్దులు వచ్చి వారి వారి ఆరోగ్య సమస్యలకు సంబదించిన విభాగాలలో స్పెషలిస్ట్ డాక్టర్స్ తో వైద్య సేవలు, రోగ నిర్ధారణకు సంబందించిన పరీక్షలు ఉచితంగా చేయించుకోవడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరం ఏర్పాట్లను, రోగులకు సదుపాయాలను కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండు రంగరాజు, పాలక వర్గ సభ్యులు , కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సి.హెచ్.జె.సోమరాజు, పి రామకృష్ణంరాజు తదితర అధ్యాపక సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భముగా గోకరాజు పాండు రంగరాజు, మన సిగ్మా న్యూస్ తో మాట్లాడుతూ.. తన తండ్రిగారు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు జన్మదిన వేడుకలు నేపథ్యంలో ఆశ్రం హాస్పటల్స్, ఏలూరు వారి సౌజన్యంతో.. ఈ ఉచిత మెగా వైద్యశిబిరం ఏర్పటు చెయ్యడం జరిగిందని, వందలాది మంది ప్రజలు వైద్య సేవలను చక్కగా ఉపయోగించుకొంటున్నారని, నేటి సాయంత్రం 5గంటల వరకు ఈ సేవలు అందుతాయని ప్రకటించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలోకార్డియాలజి, డెర్మటాలజీ, ఎండ్రోక్విలాజి, జనరల్ సర్జరీ , జనరల్ మెడిసన్ , కంటి సంబంధిత వ్యాధులు, కాటరాక్ట్ సర్జరీ, చెవి,ముక్కు, గొంతు , ఆర్దోపేటిక్, ధైరాయిడ్ మొదలగు స్పెషలైజేషన్స్ లలో ఉచిత వైద్య సేవలు,ఉచిత మందులు అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *