సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజాగా డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసలు చేపడుతున్న పలు రిలే నిరాహార దీక్షా శిబిరాలపై దాడులు జరుగుతున్నాయని ఇది సిగ్గుచేటు విషయమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ఎక్స్ వేదిక గా చేసిన ట్వీట్‌ చేసారు. డి ఎస్ సి ఉద్యోగాల స్కాం కు బాధ్యత వహిస్తూ విద్య శాఖ మంత్రిగా నారా లోకేష్ తన పదవికి రాజీనామా చెయ్యాలని, కేంద్ర సంస్థ సిబిఐ దర్యాప్తు కోరుతూ వైసీపీ శ్రేణులు విద్యార్థులు డిమాండ్ చేస్తుంటే సీఎం చంద్రబాబు తన కొడుకు పదవి కాపాడుకోవడానికి ఇంతగా దిగజారాలా ?అని ప్రశ్నించారు. ఇటీవల విజయవాడలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మరియు విద్యార్థులు నిరసన చేస్తున్న శిబిరంపై మీ ఎమ్మెల్యే బోండా ఉమా వారి అనుచరులు రాళ్లదాడి చేసి వారిని గాయపరిచారని, కోడిగుడ్లు, టమాటాలతో కొట్టారని, పోలీసులు కళ్ళ ముందే టెంట్స్ లాగివేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థుల కోసం చెల్లించవలసిన 9వేల కోట్ల పీజు రియంబర్స్ మెంట్ బకాయిలు, వసతి దీవెన చేల్లించాలని , సూపర్ సిక్స్ పథకాలలో ప్రకటించిన నెలవారీ 3వేలు చప్పున నిరుద్యోగ భృతి యువతకు చెల్లించాలని డిమాండ్ చేశారు జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *