సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాలం లో వరుస భారీ పరాజయాలతో హీరోగా బాగా వెనుకబడిపోయిన వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ సరికొత్తగా ‘కొరియా దెయ్యం’ ..హర్రర్ కామెడీ సినిమాతో తప్పని సరిగా హిట్ కొట్టేస్తాడనే ధీమాను ఇటీవల మెగాభిమానులు వ్యక్తం చేశారు. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి తో కలిసి యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. మరి మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా నేడు, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కధ విషయానికి వస్తే.. అనంతపురం జిల్లా లో పెనుగొండ లో చెక్కభజన బృందానికి నాయకత్వం వహించే కనకరాజు (వరుణ్‌ తేజ్)కు ముక్కుమీద కోపం ఎక్కువ. తరచూ గొడవల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. అతని స్నేహితుడైన కిష్టప్ప (సత్య) అతన్ని రక్షిస్తూ ఉంటాడు. కనకరాజు అన్నయ్య పృథ్వీరాజ్ (అవసరాల శ్రీనివాస్) తండ్రి (చిన్నా)తో పది లక్షలు అప్పు చేయించి, సింగపూర్ లో బిజినెస్ చేస్తానని వెళ్ళి అడ్రస్ ఉండడు. అన్నయ్య అక్కడ కష్టాల్లో ఉన్నాడని తెలిసి కనకరాజు చెక్కభజన ద్వారా తాను సంపాదించిందంతా అతనికే పంపిస్తుంటాడు. ఇదే సమయంలో కొరియాకు చెందిన ‘కియా కంపెనీలో పనిచేసే చైత్ర (రుతిక నాయక్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. చైత్రకు తన ప్రేమను ఎలా చెప్పాలో తెలియక కనకరాజు సతమతమౌతుండగా, ఓ రోజు బార్ లోని పాత్రలో ఉన్న బూడిదలో మందు కలుపుకుని పొరపాటున తాగేస్తాడు. దాంతో అందులోని కొరియన్ ఆత్మ కనకరాజును ఆవహిస్తుంది. ఆ క్షణం నుంచి అతనికి కొరియన్ భాషతో పాటు విపరీతమైన బలమూ వస్తుంది. ఇక అక్కడ నుండి కధ తిరిగే మలుపులు వెండి తెరపై చూడాలి.. అసలు కనకరాజును పట్టుకున్న ఆ కొరియా దెయ్యం ఎవరిది? ఆ తర్వాత కథ కొరియాకు వెళ్ళడం మాత్రం కొత్తగా ఉంది. మేర్లపాక గాంధీ రాసుకున్న కథ పాతదే అయినా, కొరియా నేపథ్యంతో కొత్తగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో దైవాంశను మిక్స్ చేసి దర్శకుడు సినిమాలో జోష్ పెంచాడు. ఎలాంటి లాజిక్ కు పోకుండా చుస్తే సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని ఇస్తుంది. హీరో వరుణ్‌ తేజ్ ఆత్మ ఆవహించిన తర్వాత బాగానే కష్టపడి చేసారు.. కథలో కీలకమైన చైత్ర పాత్ర ద్వితీయార్థంలో సైడ్ క్యారెక్టర్ అయిపోయింది. ఆ పాత్రను రితికా నాయక్ బాగా చేసింది. తనదైన కామెడీ టైమింగ్‌ తో అద్భుతంగా నటించి, ఈ సినిమానునిలబెట్టింది మాత్రం సత్యనే! అతని తండ్రిగా మురళీధర్‌ గౌడ్‌ కూడా బాగా చేశాడు. కాకపోతే ఈ మాంత్రికుడి పాత్రను ఇంకా సీరియస్ గా మలిచి ఉండాల్సింది. ఇతర ప్రధాన పాత్రలను అవసరాల శ్రీనివాస్, సునీల్,వీటీవీ గణేశ్‌, నటించారు.తమన్ స్వరపర్చిన పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదు. . మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. క్లయిమాక్స్ లో వి.ఎఫ్‌.ఎక్స్. కూడా బాగున్నాయి. కాలక్షేపానికి డోకా లేని సినిమా ఇది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *