సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో బోఫోర్స్ నుండి 2జి స్కాం వరకు ప్రఖ్యాత లాయర్, మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ( 6సార్లు ఎంపీ) చేసిన నాయ్య పోరాటం దేశంలో ఎవరు మర్చిపోలేరు. ఢిల్లీలో నేడు శుక్రవారం, హిందుత్వ వాదీ,బీజేపీ జాతీయ నేత సుబ్రహ్మణ్య స్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో భక్తులకు లేనిపోని అపోహలు సృష్టిస్తూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ కార్యక్రమాలపై, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు, పవన్ ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శిం చారు. నిజానికి ఇప్పుడు తిరుమలలో అన్య మత ప్రచారం జరగడం లేదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఎన్నడూ హిందూ వ్యతిరేకచర్యలకు పాల్పడలేదని తెలిపారు. సీఎం జగన్ ఫై ప్రజా క్షేత్రం లో పోరాడలేకే చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సుబ్రహ్మణ్యస్వామి విమర్శిం చారు. కాగ్ ద్వారా ఆడిట్ చేసేందుకు టీటీడీ బోర్డు స్వచ్ఛందం గా ముందుకు రావడం వారి విజ్ఞతకు నిదర్శనం అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా హిందువులకు చేసింది ఏమి లేదని సొంత మామ ఎన్టీఆర్ కు గౌరవం ఇవ్వనివాడు హిం దువులకు ఎలా గౌరవం ఇస్తాడని సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. హిందూ దేవాలయ వ్యవహారాల్లో చంద్రబాబు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. తాను ఆంధ్రజ్యోతి పత్రిక పై వేసిన 100 కోట్ల పరువు నష్టం కేసు అడ్వా న్స్ స్టేజ్లో ఉందని సుబ్రహ్మణ్య స్వా మి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *