సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజగా చేసిన ట్విట్ లో .. రాష్ట్రంలో జూలై 21 నుంచి నెల రోజుల పాటు జరిగే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పట్ల ఏపీ ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి చేపట్టే ఓటర్ వెరిఫికేషన్లో తమ ఓటు ఉందో? లేదో ? ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలన్నారు. ఓటు లేకపోతే తక్షణమే ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు అందరి బాధ్యత.. ఓటుతోనే భద్రత, భవిష్య త్తుకు భరోసా అని పేర్కొంటూ ఆయన ట్వీ ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *