సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి లో అక్టోబర్ నెలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనానికి వెళ్లే భక్తుల కోసం .. రేపు, మంగళవారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేయనున్న ట్లు టీటీడీ బోర్డు ప్రకటించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన సుప్రభాతం , తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీ డిప్ కోసం రేపు జులై 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదుచేసుకోవాలి. తదుపరి లక్కీ డీప్ లో టికెట్స్ పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. స్వామివారి కల్యాణోత్సవం , ఆర్జిత బ్రహ్మోత్సవం , ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను జులై 21న ఉదయం 10గంటలకు విడుదల చేస్తారు. అక్టోబర్ నెల అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను జులై 24న ఉదయం 10గంటలకు విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి శ్రీవారి సేవా టికెట్లను బుక్ చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *