సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం భీమవరం పట్టణం లోకి ప్రవేశించే ప్రతి ద్విచక్ర వాహన దారులు బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులుకు ఎస్పీ యు.రవిప్రకాష్ ఆదేశాలతో ఇచ్చిన ఆదేశాలు నేటి, బుధవారం నుండి అమలులోకి తెచ్చారు. భీమవరం పట్టణ శివారుల్లో ప్రధానమైన ఆరు రహదారుల్లో చిరు వర్షం పడుతున్నప్పటికీ పోలీస్ లు హెల్మెట్ ధరించని వాహనదారులను అడ్డుకొన్నారు, హెల్మెట్ ధరించాలనే నిబంధనను ఇకపై పోలీసు శాఖ కఠినంగా అమలు చేస్తుంది.గత కొంత కాలంగా భీమవరంలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులైన వారిలో హెల్మెట్ ధరించని వారే ఎక్కువగా ప్రాణాలను కోల్పోతున్నట్లు నిర్ధారణ కావడంతో నేటి నుండి హెల్మెట్ ధారణ తప్ప నిసరి చేస్తూ ప్రయోగాత్మకంగా భీమవరం లో ‘నో హెల్మె ట్.. నో’ ఎంట్రీ ‘ కార్యక్రమం ప్రారంభించారు. రహదారుల్లో ఇకపై పోలీసులు రోజు 24 గంటల పాటు నిఘా వేస పట్టణం లోనికి రాకుండా అడ్డుకుంటారు.. భీమవరంలో ‘నో హెల్మె ట్.. నో’ ఎంట్రీ ‘ విజయవంతం చేసి అనంతరం జిల్లా లోని నరసాపురం ,తణుకు,తాడేపల్లిగూడెం పట్టణాల్లోని నాలుగు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ పరిధిలో అమలు చెయ్యాలని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *