సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సాయి ధరమ్ హీరోగా మరి కొద్దీ రోజులలో రాబోతున్న బ్రో’ సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజగా నేడు, గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మేము అనుకున్న బడ్జెట్లోనే తక్కువ సమయంలో సినిమాని పూర్తి చేయగలిగాము. బిజినెస్ పట్ల కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాము. టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదు. టికెట్ ధరలు పెంచాలని మేము రెండు రాష్ట్ర ప్రభుత్వాలని కోరలేదు. ఇప్పుడున్న ధరలతోనే విడుదల చేయాలని అనుకుంటున్నాం..’’ అని తెలిపారు. అలాగే రిలీజ్ రోజు రికార్డు కలెక్షన్స్ కోసం అభిమానుల కోసం వేసే మొదటి ప్రీమియర్ షోల గురించి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు అయితే ఆ ఆలోచన లేదు. ఎందుకంటే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే బుక్ అవుతాయి. అయితే అభిమానుల నుంచి ఒత్తిడి వస్తే చెప్పలేం. అప్పటి పరిస్థితులను బట్టి ప్రీమియర్ షోలపై నిర్ణయం తీసుకుంటాం’’ అని అన్నారు. మొత్తానికి మెగా అభిమానులు సాధారణ టికెట్స్ రేట్లకే బ్రో సినిమా చేసేయవచ్చు.. .
