సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేటి శుక్రవారం నుండి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి పి ప్రశాంతి ఆదేశాలతో నెల రోజులపాటు ఇంటింటా ఓటర్ల జాబితా పరిశీలన ను అధికారులు ప్రారంభించారు, నేటి నుండి (ఈ నెల 21 )ఆగస్టు 21 వరకు సమగ్ర ఓటరు సర్వే ప్రక్రియను బూత్‌ లెవెల్‌ అధికారులు నిర్వహిస్తారు. ఈ దృష్ట్యా దోషరహిత, పారదర్శకంగా ఓటరు జాబితా రూపకల్పనకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతినిధులు పర్యవేక్షిస్తారు, అర్హత ఉన్న వారికి ఓటు హక్కు కల్పించేందుకు ఫారం–6, తొలగింపునకు ఫారం–7, మార్పుల కోసం ఫారం– 8 ద్వారా మార్పుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. మృతి చెందిన లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలను ఇంటింటా సర్వేలో నమోదు చేస్తారు. సర్వేలో వలంటీర్లు పాల్గొనరు. బూత్‌ లెవెల్‌ అధికారులు స్వీకరించిన వివరా లను ప్రతి మంగళవారం నియోజక వర్గ స్థాయిలో, ప్రతి బుధవారం జిల్లా స్థాయిలో పరిశీలిస్తారు. అక్టోబరు 17 నుంచి నవంబరు 30 వరకు ఓటరు జాబితాపై ఫిర్యాదులను స్వీకరిస్తారు. డిసెంబరు 26న దావాలు, అభ్యంతరాలు తొలగింపు, 2024 జనవరి 1న ఓటర్ల జాబితాను తనిఖీ చేసి తుది ప్రచురణ కోసం ఎన్నికల కమిషన్‌ అనుమతి, 2024 జనవరి 5న ఓటర్ల జాబితా తుది ప్రచురణ జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *