సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో పౌరులు ఆదాయ పన్ను రిటర్న్ లను దాఖలు చేసేందుకు జులై 31 ఆఖరు తేదీ. ఈ ఏడాది ఆఖరి తేదీ పొడిగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ ఉద్దేశం లేదని ఆర్థిక మం త్రిత్వ శాఖ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు రిటర్న్ లను జులై 31 లోగా దాఖలును కచ్చితంగా చేయాల్సిందే. గడువు పెంచుతారో తెలియదు గానీ, ఐటీఆర్ లను దాఖలు చేయకపోతే మాత్రం భారీ జరిమానా, ఒక్కో సందర్భంలో జైలు శిక్షపడే అవకాశాలు ఉంటాయని ఐటీ శాఖ తెలియజేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *