సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో (ISRO) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నేటి ఆదివారం ఉదయం 6.31 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ సీ-56 (PSLV C-56) రాకెట్‌ను ప్రయోగించారు. రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. నిప్పులు చెరుగుతూ నింగిలోకి రాకెట్ దూసుకుపోయింది. ఆ రాకెట్ తో పాటు సింగపూర్ దేశానికీ చెందిన 7 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వీ సీరిస్‌లో ఇది 58వ ప్రయోగం. ఈ ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ స్వయంగా పర్యవేక్షించారు. పీఎస్ఎల్వీ రాకెట్ పొడవు 44.4 మీటర్లు, బరువు 228.642 టన్నులు. ఏడు ఉపగ్రహాల బరువు 422కిలోలు. 23 నిమిషాల్లో ప్రయోగం పూర్తి చేశారు. దీనితో ఇతర దేశాల ఉపగ్రహాలను అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ప్రవేశపెడుతున్న భారత్ లోని ఇస్రో కీర్తి మరింత పెరిగింది.
