సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం నగరి మం డలం లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా టేక్ హోమ్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. పది రకాల పోషక ఆహారాల కిట్స్ ను పలువురు గర్భిణీ స్త్రీలు, బేబీ మదర్స్ కు అందించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా, మాట్లాడుతూ… గర్భవతులకు బాలింతల సౌకర్యార్థం ఇంటింటికే పోషకాహార కిడ్స్ పంపిణీకి శ్రీకారం చుట్టిన సీఎం జగన్కు ధన్య వాదాలు తెలిపారు. .దేశం లో ఎందరో సీఎం లు ఉన్నా రని.. మాకు విజన్ ఉంది అని చెప్పు కునే డబ్బా రాయుళ్లు, 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే వాళ్లను సైతం చూశామని చంద్రబాబు ఫై సెటైర్లు వేశారు. గత టీడీపీ పాలనలో రక్త హీనతతో గర్భిణీలు చనిపోయారని అన్నారు. జన్మ భూమి కమిటీ పేరుతో కోడిగుడ్లు, బియ్యం ,పప్పు తినేశారో తెలుసని విమర్శించారు. వాలంటీర్లు ఇంటికి బాలింతలకు పోషకాహారం ఇస్తున్నట్లు చెప్పా రు. ఒక మహిళ డేటా తీసుకోవడం ద్వారా ఇవన్నీ ఇవ్వగలమన్న విషయం పవన్ తెలుసుకోవాలని హితవు పలికారు. ‘చంద్రబాబు, పవన్ మొన్నటి వరకు వాలంటీర్ల మీద పడి ఏడ్చా రు. మాజీ మంత్రి నారాయణ తమ్ము డు భార్య కృష్ణప్రియ వీడియోలు పెట్టింది. పవన్ అభిమాని అని చెప్పింది. నాకు న్యాయం చేయమని అడిగింది. కేసు పెట్టింది దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు. ఎన్నికలకు ఇచ్చే ఫండ్, ప్యాకేజీ స్టార్కు ఇచ్చే ఫండ్ తీసుకుని నోటికి ప్లాస్టర్ వేసుకున్నారా?. నోరు ఉంది కదా అని షూటింగ్ గ్యాప్ లో వచ్చి ఏది పడితే అది మాట్లాడటం సరికాదు.అని రోజా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *