సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి మరియు సీనియర్ రాష్ట్ర నేత, మెంటే పార్ధ సారధి కలసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మీ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం అభివృద్ధికి తొలి ప్రాధాన్యతనిచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ప్రతి శుక్రవారం ఇక్కడ అర్జీలు ఇచ్చిన ప్రజా సమస్యలును ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళ్ళి త్వరితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మెన్ మెఱగాని నారాయణమ్మ ఏఎంసి మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరు చంద్రశేఖర్ పామర్తి వెంకటరామయ్య తదితర టీడీపీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *