సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగునాట సహజనటిగా పేరున్న జయసుధ నేడు, బుధవారం సాయంత్రం ఢిల్లీలో అధికారికంగా బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ ఆమెకు కండువా కప్పి కాషాయం పార్టీలోకి ఆహ్వానించారు. ప్రాథమిక సభ్యత్వం అందించారు. ఈ కార్యక్రమంలో తెలం గాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి పాల్గొన్నారు. గతంలో వై యస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫై ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర జయసుధకు ఉంది. తదుపరి, భర్త మరణం, ఆర్ధిక కారణాలతో ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు.తాజగా జయసుధ చేరిక బీజేపీకి ఉత్సహాన్ని ఇస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
