సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో DNR ఇంజనీరింగ్ కళాశాల ఇటీవల నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిషన్ కౌన్సిల్ వారి చే A ++ గ్రేడు సాధించిన సందర్భం గా నేడు, గురువారం కళాశాలలో మీడియా సమావేశంలో డీఎన్ఆర్ విద్య సంస్థల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు , కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) మాట్లాడుతూ.. DNR ఇంజనీరింగ్ కళాశాల NAAC A ++ గ్రేడు సాధించడం చాలా గర్వకారణం అన్నారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగా ఈ ఉత్తమమైన గ్రేడును కళాశాల సాధించిందని అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు, ప్లేసెమెంట్స్ ట్రైనింగ్ మరియు ఇతర సదుపాయాలు ఇప్పటికే కల్పించామని, విద్యార్థులకు అధునాతన సబ్జక్ట్స్ ఏర్పాటుకు తమ పాలకవర్గం ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. తమ పాలకవర్గ కృషి మరియు కళాశాల సిబ్బంది కృషితో జాతీయ స్థాయిలో అత్యున్నత విద్య ప్రమాణాలతో NAAC A ++ సాధించామని అన్నారు. కాలేజీలో మౌలిక సదుపాయాలు, శిక్షణ, ప్లేసెమెంట్స్ రాజీలేకుండా విద్యార్థులకు అందుబాటులో ఉంచామని అన్నారు. స్మార్ట్ ఇండియన్ హాకతోన్ 2019 లో సౌత్ ఇండియా రన్నర్స్ గా నిలవడం వంటి అనేక విజయాలు తమ కళాశాల సొంతంచేసుకుందని DNR ఇంజనీరింగ్ కళాశాల లో నేలుకొల్పబడిన APSSDC స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 2000 మంది విద్యార్థులు అనేక రంగాలలో శిక్షణ పొందారని తెలిపారు. పేద విద్యార్థులకు పలు ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా ఎం అంజన్ కుమార్, కళాశాల ఉప అధ్యక్షులు, గోకరాజు పాండురంగరాజు సహాయ కార్యదర్శి కొత్తపల్లి శివరామరాజు ,వైస్ ప్రిన్సిపాల్ డా బి వి ఎస్ వర్మ,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *