సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన ఖరారు అయ్యింది. ఆగష్టు 7, 8 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. వచ్చే ఆదివారం సాయంత్రం షెడ్యూలు ఖరారు అవుతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు, గురువారం వరద ప్రభావిత జిల్లాలైన పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, తూ.గో, అంబేద్కర్ కోనసీమ, అల్లూరిసీతారామరాజు, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా..సహాయ, పునరావాస కార్యక్రమాలు సమర్థవంతంగా జరగాలని కలెక్టర్లను ఆదేశించారాయన. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో కలెక్టర్లు సహా,అధికారులకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నాం .టిఆర్-27 నిధులను సకాలంలో విడుదల చేస్తున్నాం. సహాయ, పునరావాస చర్యలు సమర్థవంతంగా చేపట్టాలి, ఈ సహాయం అందని వరద బాధిత కుటుంబం ఉండకూడదు. సహాయశిబిరాల్లో ఉండి, వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2000, వ్యక్తులైతే రూ.1000లు ఇచ్చి పంపించాలి. కలెక్టర్లు బాగాచూసుకున్నారనే మాట వినిపించాలి అని అధికారులతో సీఎం జగన్ అన్నారు.
