సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ సర్కార్ చొరవతో త్వరలో ఏలూరు లో ప్రారంభం కానున్న మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. మొత్తం 150 ఎంబీబీఎస్ సీట్లకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వగా, వీటిలో 22 (15 శాతం) సీట్లను కేంద్రం నీట్ ద్వారా ఇప్పటికే భర్తీ చేసింది. వారంతా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో నేటి శుక్రవారం సాయంత్రం 4 గంటలలోపు ఈ కాలేజీలో అడ్మి షన్లు పొందాల్సి ఉంది. ఒకవేళ వారు కాలేజీలో చేరకపోతే ఆ సీట్లు తిరిగి వారికి ఇవ్వరు. ఆ సీట్లు సెకండ్ కౌన్సెలింగ్‌కు వెళ్లిపోతాయి. మిగిలిన 128 సీట్లను రాష్ట్ర కౌన్సెలింగ్ ద్వారా ఈ నెలాఖరులోపు భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఎంసీహెచ్ విభాగంపై బాలికలు, బాలురకు వేర్వేరుగా 110 మందికి హాస్టల్ వసతి కలిస్తామన్నారు మెడికల్ చదివే విద్యార్థులకు కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ విజయ్‌కు మార్ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్, అకడమిక్ ఇయర్ ప్రిన్సిపాల్ పి.సత్యనారాయణరావు, హెచ్‌వోడీలు పాల్గొన్నారు..
