సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కేంద్రంలోని మోడీ సర్కార్ ఇటీవల ప్రకటించిన అమృత్‌ భారత్‌ అభివృద్ధి కార్యక్రమాలలో నిధుల కేటాయింపులో పశ్చిమ గోదావరి జిల్లా దేశంలోనే రికార్డుగా నిలిచింది. జిల్లాలో ఈ పథకం కింద మూడు రైల్వే స్టేషన్లు ఎంపిక చేసారు, ఏపీ రాష్ట్రంలో మొత్తం 18 స్టేషన్లు ఎంపికవగా అందులో పశ్చిమ గోదావరి లో మూడు స్టేషన్లు ఉండటం వాటి అభివృద్ధి కి రూ.73.05 కోట్లు కేంద్ర నిధులు కేటాయించడం విశేషం. భీమవరం రైల్వే స్టేషన్స్ అభివృద్ధికి రూ.22.13 కోట్లు,నరసాపురం స్టేషన్‌కు రూ.25.7కోట్లు, తాడేపల్లి గూడెం రూ.27.13 కోట్లు, చొప్పున నిధులు ఇచ్చారు. ఈ నిధులతో చేపట్టే పనులకు ఈనెల 6న ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపన చేయనున్నారు. 6న ఈ మూడు స్టేషన్లలో పనుల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జీల్లా రాజకీయ ప్రముఖులు తో పాటు అధికారులు, స్వచ్చంద సంస్థలు, విద్యార్థులు, లను ఆహ్వానించి వారితో స్టేషన్‌ పరిధిలో ఒక సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో కోణంలో చుస్తే.. నరసాపురం పార్లమెంటరీ పరిధిలో బీజేపీ కి 2సార్లు గెలుచుకున్న రికార్డు ఉండటం వచ్చే లోక్ సభ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో ఈ స్థానంలో బీజేపీ బలమైన పోటీ ఇవ్వడానికి పలు రైల్వే అండర్ టర్నల్స్ నిర్మాణాలు,అమృత్ సురక్షిత నీటి సరఫరా, టీడీకో గృహాలు వంటి పధకాలు కేటాయింపుల ఫై ద్రుష్టి పెట్టిందని చెప్పవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *