సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల భీమవరం పరిసరాలలో ‘ జగనన్న కాలనీలలో పేదల ఇళ్ల కోసం ఇచ్చిన స్థలాలులో వర్షాలు పడుతున్నప్పుడు తిరుగుతూ వాటిలో నీళ్లు నిండిపోయాయని, ఇక్కడ కడుతున్న ఇల్లులు నివాస యోగ్యం కాదని జనసేన నేతలు ఏవో తప్పుడు ప్రకటనలు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని ఇది సరైన పద్దతి కాదని అన్నారు. ‘జంబలకడ పంబ’ సినిమా తీరున జనసేన వారి వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేసారు. పేదల ఇళ్ళు స్థలాలు నిర్మాణాలు కోసం తాము, జగన్ సర్కార్ ఎంతో కష్టపడి వేలకోట్లు ఖర్చుపెట్టి స్థలాలు సేకరించి పేదల ఇళ్ళ నిర్మాణానికి సహకరిస్తూ తాము ‘ప్రసవ వేదన’ పడుతుంటే.. ఏ పని చెయ్యకుండా, ప్రజలు కు ఏ మేలు చెయ్యకుండా .. చేసేవారిని చెడకొట్టేందుకు తప్పుల కోసం వెతికే ‘జనసేనవారికి నొప్పులు’ వస్తున్నాయని ఇదేం చోద్యమో? అని విమర్శించారు. తాడేరు వంతెన నిర్మాణం కోసం టెండర్ పక్రియలు తాము ప్రారంభించిన ఏడాదికి… జనసేన నేతలు పాదయాత్ర చేసి.. తీరా తాడేరు వంతెన పనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతుంటే ఇది తమ జనసేన గొప్ప అని డప్పు కొట్టుకొంటున్నారని ఇది కూడా జంబాలకిడి పంబ లో రివర్స్ వేషాలు తీరునే ఉందని ఎద్దేవా చేసారు.
