సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దిల్ రాజు నిర్మాతగా 50వ సినిమాగా ..భారీ సినిమాల అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తెచ్చుకొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’ ‘ఫస్ట్ లుక్ పోస్టర్’ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా రానుందని సమాచారం. 200కోట్ల భారి బడ్జట్ తో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్స్ ప్లే చేస్తున్నాడు. ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి స్టూడెంట్ రోల్. ఈ స్టూడెంట్ రోల్ కి ఇంకో షేడ్ ఉన్నట్లు సమాచారం. సినిమాకి హైలైట్ గా నిలిచే ‘ఎన్నికల అధికారి’ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు. ‘గేమ్ చేంజర్’ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పార్ట్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది.. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ని రిలీజ్చెయ్యడానికి చిత్రయూనిట్ రెడీ అవుతోంది. గ్రాండ్ స్కేల్ లో ఒక భారీ ఈవెంట్ చేసి మరీ గేమ్ చేంజర్ టీజర్ ని ఆగస్ట్ 15న స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుతో విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *