సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్ర బాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటిం చనున్నారు. నేటి ఆదివారం సాయంత్రం విజయవాడ మీదుగా మీదుగా రాత్రికి ఏలూరు మినీ బైపాస్ వద్ద వున్న ఓ ఫంక్షన్ హాల్‌కు చేరుకుని, రాత్రి బస చేస్తారు. అక్కడే ఉమ్మడి జిల్లా నేతలతో రాత్రి సమావేశం అయ్యే అవకాశం ఉంది. తదుపరి సోమ వారం ఉదయం పది గంటలకు పోలవరం పర్యటనకు బయలుదేరతారు. కొవ్వూరు మీదుగా తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను సందర్శించి, అక్కడి నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పోలవరం మండలం పట్టిసీమకు చేరుకుని అక్కడి ఎత్తిపోతలను పరిశీలించి తదుపరి, అక్కడి నుంచి పోలవరం చేరుకుని ప్రాజెక్టును, పనుల తీరును పరిశీలిస్తారు. సాయంత్రం ఆరుగంటలకు తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మీదుగా దేవరపల్లి చేరుకు ని రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం రాజమహేంద్ర వరంలో రాత్రి బస చేస్తారు.
