సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు రేపు సోమవారం నుంచి కౌన్సిలింగ్ ప్రారంభకానుంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ప్రభుత్వం రాష్ట్రంలోని 107 ఇంజనీరింగ్ కాలేజీలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో మొత్తం 227 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా అందులో కేవలం 120 కళాశాలలకు మాత్రమే అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీలకు కామన్ సర్వీస్ ఫీజు చెల్లించాలని కళాశాలలకు గతంలో ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే ఆ నోటీసులపై 11 ఇంజనీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. కామన్ సర్వీస్ ఫీజుపై ఒత్తిడి చేయకుండా ఆన్ లైన్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కేసులో ఇంజనీరింగ్ కళాశాలకు కనీస ఫీజు రూ. 43,000గా హైకోర్టు నిర్ధారిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుల నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ వైఖరి ఫై పలు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *