సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రజా యుద్ధ నౌక , ఉద్యమ కళాకారుడు, ప్రజా గాయకుడు గద్దర్ కన్ను మూశారు. కొద్దీ రోజుల క్రితం గుండెపోటు కు గురి అయ్యి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేటి, ఆదివారం మధ్యాహ్నం గద్దర్ తుదిశ్వాస విడిచారు.కాగా, గద్దర్ చనిపోయినట్టు ఆయన కుమారుడు సూర్యం తెలిపారు. అయితే, గద్దర్ రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో గుండె ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విషాదకరంగా మారింది. తెలంగాణ ఉద్యమం లో గద్దర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గద్దర్ 1949లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని తుప్రాన్లో జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్రావు. హైదరాబాద్లో ఇంజినీరింగ్ చదివారు. గద్దర్ కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. 1969 నుండి తెలంగాణ ఉద్యమంకు తన ఆటపాటలతో గద్దర్ ఉపిరిపోసారు.1975లో కెనరా బ్యాంకులో గద్దర్ ఉద్యోగం చేశారు.1984లో కెనరా బ్యాంక్ క్లర్క్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం.. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ పోరాడారు. మా భూమి సినిమాలో వెండితెరపై గద్దర్ కనిపించారు. నక్సల్ పోరాటానికి మార్గదర్శకంగా నిలచిన జననాట్య మండలి వ్యవస్థాపకుల్లోగద్దర్ కూడా ఒకరు. ఉద్యమ సమయంలో జగపతి బాబు, శృతి ఇరానీ జంటగా వచ్చిన జైబోలో తెలంగాణ సినిమాలో ‘పొడుస్తున్న పొద్దుమీద తెలంగాణ..అనే గద్దర్ పాట[ ఉద్యమానికి ఊపునిచ్చింది, 1997 ఏప్రిల్ 6న గద్దర్పై హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో నకిలీ ఎన్కౌంటర్లను గద్దర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజా సాహిత్య పురస్కా రం కూడా గద్దర్ అం దుకున్నా రు. ఆర్ నారాయణమూర్తి హీరోగా ఒరేయ్ రిక్షా సినిమాలో ‘నీ పాదం మీద పుట్టుమచ్చ నై చెల్లెమ్మా ‘అనే పాటకు నంది అవార్డు వచ్చింది.ఆ అవార్డు తిరస్కరించారు.గద్దర్ మృ తి నేపథ్యంలో పలువురు రచయితలు, కళాకారులు కూడా అపోలోకు తరలివెళ్లారు.
