సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలో పలు పంచాయితీలలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈ నెల 19న నిర్వహించనున్నారు. గత 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పలు కారణాలతో ఎన్నికలు వాయిదా పడిన గ్రామాల్లో, వివిధ కారణాలతో ఖాళీ అయిన సర్పంచి, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 గ్రామాలలో సర్పంచి, 75 వార్డు సభ్యు ల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. పశ్చిమగోదావరిలో మూడు సర్పంచి స్థానాలు, అయిన కావలిపురం (ఇరగవరం) అగర్తిపాలెం (పాలకొల్లు) దొడ్డిపట్ల (యలమంచిలి)లతో పాటు 28 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.అలాగే ఏలూరు జిల్లాలో 4 సర్పంచి, 47 వార్డు సభ్యులు, కోసం ఎన్ని కలు జరగనున్నాయి. దీనికి సం బంధించి ఈనెల 8న నామినేషన్స్ స్వీకరిస్తారు. ఉపసంహరణకు 14న మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. ఇక పోలింగ్ 19వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ నిర్వహించి అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. అనివార్య కారణాలతో ఎక్క డైనా ఎన్నికల ప్రక్రియ నిలిచిపోతే 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు కౌంటింగ్ పూర్తిచేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *