సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2014 కు ముందు ఆంధ్ర ప్రదేశ్ ను ముక్కలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీ పెడుతున్న విభజన బిల్లును ఆమోదించవద్దని ఉత్తరాది పార్టీల మద్దతు కోసం వైసిపి అధినేత జగన్ విన్నతి పత్రాలతో అభ్యర్ధనలతో ఎక్కని గుమ్మం లేదు దిగని గడప లేదు. ఎవరు సహకరించలేదు. కాలచక్రం తిరిగింది. ఇప్పుడు ఢిల్లీ రాష్ట్ర హక్కులు కేంద్రం కొత్త చట్టంతో కత్తెర వేస్తుందని సీఎం క్రేజీ వాల్ ఆ బిల్లు ను అడ్డుకోవాలని ఇచ్చిన పిలుపు కు కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి లోని అన్ని పార్టీల మద్దతు పలుకుతున్నాయి. కేవలం ప్రధాని మోడీ ఫై వ్యతిరేకత తో మాత్రమే.. అయితే ఇంత కీలక సమయంలో దక్షిణాదిన అతి పెద్ద పార్టీ బలం కలిగిన వైసిపి మోడీ కి అండగా నిలుస్తుంది. ఇప్పటికే లోక్ సభలో 300 పైగా ఎంపీలు ఉన్న ఎన్డీయే తో పాటు 22 మంది వైసిపి ఎంపీలు మద్దతు తో అమిత్ షా ప్రవేశపెట్టిన ఢిల్లీ బిల్లు ఘన మెజారిటి తో గెలిచింది. ఇక రాజ్యసభ లో కూడా గెలవాలి. నేడు, సోమవారం బిల్లు చర్చ కు వచ్చింది. ఇక ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై రాజ్య సభలో వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఇండియా కూటమి ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ‘తానా షాహీ పార్టీ’. కానీ ఢిల్లీ దేశ ప్రజలందరికి చెందింది. ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీకి చెందింది కాదు..రాష్ట్ర కార్యనిర్వాహణలో కేంద్రం జోక్యం అవసరం ఉంది. ఈ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ఇస్తోంది అని ప్రకటించారు. నిజానికి రాజ్యసభలో బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయేకు 110 మంది సభ్యులు మాత్రమే ఉండగా వైసిపి కి ఉన్న 9 సభ్యుల బలం కలుపుకొని 119 ఓట్లు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలోని విపక్ష పార్టీలు కలుపుకుని ఏకంగా 128 మంది సభ్యులు ఉన్నారు. దీంతో. పెద్దల సభలో బిల్లును ఎలాగైనా ఓడించాలనే ధీమాతో విపక్ష ఇండియాకూటమి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *