సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ త్రైమాసికం లో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్సా ర్ కళ్యా ణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పధకంను సీఎం వైఎస్ జగన్ నేడు, బుధవారం ప్రారంభించారు. ఇందుకు అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమా చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎస్సీ , ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు ‘వైఎస్సార్ కళ్యా ణమస్తు’ ద్వారా, ముస్లింమైనార్టీ వర్గాల ఆడపిల్లలకు ‘వైఎస్సా ర్ షాదీ తోఫా’ ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *