సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ముందస్తు అనుమతి లేకుండా పుంగనూరు పట్టణంలో పర్యటించడానికి సిద్దమైన టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకొన్న పోలీసులపై టీడీపీ క్యాడర్ కోపంతో అనేక మంది పోలీసులు ఫై రాళ్ల దాడికి దిగిన నేపథ్యంలో పోలీసులు గాయాలు పాలుకావడం, వాహనాలు దగ్ధం కావడం,ఒక కానిస్టేబుల్ కంటి చూపు కూడా పోగొట్టుకొన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ తో పాటు, రాష్ట్ర పోలీస్ సంఘం.. చంద్రబాబు ఒక ప్యూహం ప్రకారం అరాచకం సృష్టించాలని దగ్గరుండి ఈ దాడి చేయించాడని, టీడీపీ అభిమానులను రెచ్చకొట్టాడని తీవ్ర నిరసన తెలియజేస్తూ చంద్రబాబు ఫై ప్రభుత్వం కేసు పెట్టి అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేసిన విషయం అందరికి తెలిసిందే.. ఈ నేపథ్యంలో నేడు, బుధవారం తంబళ్లపల్లి నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసు నమోదైంది. నాలుగో తేదీ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లులో జరిగిన సంఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడుపై ఏ 1గానూ.. దేవినేని ఉమాపై ఏ 2గా కేసులు నమోదు చేశారు. వీరితో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి.. పీలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి..తోపాటు మరి కొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 4న మారణాయుధాలు, ఐరన్‌ రాడ్లు, ఇటుకలు, కర్రలు వంటి వాటితో ప్రయాణిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ ఉమాపతిరెడ్డి ఫిర్యాదు చేశారు. 307 హత్యాయత్నం, 120 B నేరపూరిత కుట్ర చట్టాలు కింద కేసు నమోదు చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *