సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పురాణాలలో పేర్కొన్న పవిత్ర పంచారామ క్షేత్రలలో ఒకటైన భీమవరం గునుపూడిలోని ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో నేడు, బుధవారం ధర్మకర్తల మండలి చైర్మెన్ భర్త కోడె యుగంధర్ ఆలయంలో శ్రీ స్వామివారికి అడ్డంగా నిలబడి దణ్ణం పెట్టుకొంటుంటే ఆలయ సహాయ అర్చకులు సంద్రంగి నాగేంద్ర ఆయనను అడ్డు తొలగమని చెప్పడంతో గొడవ మొదలయింది. ఆయన ఆగ్రహంతో అర్చకుడు బయటకు వచ్చాక ఆగ్రహంతో దురుసుగా ప్రవర్తించి అర్చకుని పరమ పవిత్రమైన యజ్ఞోపవేశాన్ని తెంచివేశారని.. స్థానిక అర్చకులతో కలసి ఈ ఓ, చాగంటి సురేష్ నాయుడు కు తదుపరి పిర్యాదు చెయ్యడంతో ప్రశాంతమైన ఆలయ వాతావరణం ఒక్కసారిగా వేడికింది. ఆలయ ధర్మకర్తల చైర్మన్, కోటి విజయలక్ష్మి భర్త యుగంధర్ వైసీపీ నాయకుడు , మరియు జాతీయస్థాయిలో జిల్లా కు ప్రాతినిధ్యం వహిస్తున్న బిసి నేత కూడా కావడంతో ఈ సంఘటన రాజకీయ కోణంలోకి వెళ్ళింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఈ ఘటనను ఖండించి దోషి ఫై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఆలయ పురోహితులు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దృష్టికి తీసుకొని వెళ్ళటంతో ఆయన పురోహితులు ను శాంతపరచి, కోడె యుగంధర్ ఫై చర్యలు తీసుకొంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. జరిగిన పరిణామాల నేపథ్యంలో తన భర్త తప్పు చేసిఉండరని అయితే .. నైతిక బాధ్యతగా దేవాలయ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కోడె విజయలక్ష్మి తన రాజీనామా లేఖ ను ఇఓ కు అందజేశారు.
