సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు ఖాయం అని .. భీమవరం సీటు జనసేన కు కేటాయింపు ఖాయం అని గత కొంతకాలంగా వస్తున్న ఊహాగానాల మధ్య ఉత్సహం కొరవడిన టీడీపీ క్యాడర్ కు కొత్త ఉత్తేజం ఇచ్చి దిశగా కార్యాచరణ జరుగుతుంది.. దానిలో భాగంగాభీమవరం నియోజవర్గ టీడీపీ నేతల సమావేశం నిర్వహించిన జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. జల ప్రాజెక్టులు సందర్శిస్తున్న చంద్రబాబు ఫై జగన్ సర్కార్ కక్షతో ఏ 1నిందితుడుగా , ఇతర నేతలపై కేసులు పెట్టడం దారుణం అన్నారు, ఏది ఏమైనా త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి పార్టీ నాయకులు కార్యకర్తలు కృషిచేయాలని, పిలుపు నిచ్చారు. క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, బూత్‌ ఇన్‌చార్జిలతో ఓటర్‌ వెరిఫికేషన్‌ సకాలంలో పూర్తి చేయించాలని ,క్లస్టర్‌ యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జిల పనితీరులను పార్టీ అధినేత చంద్రబాబు గ్రేడింగ్‌ ఇస్తున్నారన్నారు అని గుర్తుచేశారు, ఈ కార్యక్రమంలో నియోజవర్గ పరిశీలకులు దాసరి ఆంజనేయులు రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి,రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్‌ డ్వాక్రా అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, TDPపట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యంరాజు, గూడూరి సుబ్బారావు,మాదాసు కనకదుర్గ, మామిడిశెట్టి ప్రసాదు, చెల్లబోయిన సుబ్బారావు, ఐజాక్‌ బాబు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *