సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న అన్ని ధరలతో పాటు కూరగాయలు లోరిటైల్ మార్కెట్లో కేజీకి వచ్చి టమాటా 250 రూ, అల్లం 350 రూ, పచ్చిమిర్చి 200 రూపాయలకు పెరిగిన ధరలు రికార్డు స్థాయిలో వినియోగదారులను తాకాయి, వీటిలో పచ్చిమిర్చి ధరలు మరల కేజీ 80 రూపాయలకు దిగిరాగా .. తాజా శుభవార్త ఏమిటంటే.. ఏపీలో టమాటా హోల్ సేల్ పెద్ద మార్కెట్ అయినా మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో టమాటా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత నెల 30న మార్కెట్ చరిత్రలోనే కిలో టమాటా అత్యధికంగా రూ.196 పలికిన నేపథ్యంలో.. అకస్మాత్తుగా గత 3 రోజులుగా దిగి వస్తున్నాయి. నిన్న బుధవారం వరకు అత్య ధికంగా కిలో టమాటా రూ.100 వరకు ఉం ది. గురువారం ఈ ధరలు ఒక్క సారిగా తగ్గాయి. హోల్ సేల్ గా.. ఏ గ్రేడ్ కిలో టమాటా రూ.50 నుంచి రూ.64 వరకు, బీ గ్రేడ్ రూ.36 నుంచి రూ.48 వరకుఉంది. ఇటీవల టమాటా కొత్త పంట దిగుబడులు పెరగటంతో నేటి గురువారం నుండి.. సగటున కిలో టమాటా రూ.44 నుంచి రూ. నుండి రైతుల వద్ద కొనుగోలు చేసినట్లు సమాచారం. అంటే రిటైల్ మార్కెట్ లో ఎంత లేదన్న కేజీకి 55 నుండి 60 రూపాయలు లోపు ఉంటుంది, త్వరలో గతంలో ఉన్న కేజీ కి 15-20 రూ రేటు రావాలని వినియోగదారుల ఆశ నిజం కావాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *